హైకోర్టు మెట్లు ఎక్కనున్న జూనియర్ ఎన్టీఆర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో ….యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇరవై ఏండ్ల కిందట అంటే 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ లో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు..
అయితే అప్పటికే లక్ష్మీ ఆ ప్లాట్ పై బ్యాంకులో లోన్ తీసుకున్న విషయం ఆమె దాచి ఉంచారు. లోన్ కు సంబంధించి రుణం మొత్తాన్ని లక్ష్మీ చెల్లించకపోవడంతో ఆ ప్లాట్ ను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు.
ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై హీరో ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా డీఆర్టీ రావడంతో కోర్టు మెట్లెక్కారు.