తాతకు తగ్గ మనవడు జూనియర్ NTR
ఏపీకి చెందిన కౌశిక్ అనే యువకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. గత కొంతకాలంగా కౌశిక్ క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడు వైద్యఖర్చులకు అరవై లక్షల వరకు అవుతుంది. దేవర సినిమా చూడకుండా చనిపోతాడేమో.. చివరగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ అయిన తన కుమారుడ్ని చూడాలని ఆ యువకుడి తల్లి మాట్లాడుతూ తీసిన వీడియో వైరల్ అయ్యి ఎన్టీఆర్ వరకు వెళ్లింది.
దీనిపై స్పందించిన ఎన్టీఆర్ కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడాడు. కౌశిక్ మాట్లాడుతూ నేను మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు.. మీతో మాట్లాడతానని అనుకోలేదు.. దేవర సినిమా చూడకుండా చనిపోతానేమో అని అనుకున్నాను అన్న అని అన్నాడు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ నీతో మాట్లాడకపోతే నేనేందుకు.. దేవర సినిమా తర్వాత చూడోచ్చు..
ముందు నువ్వు త్వరగా కోలుకుని రా. ధైర్యంగా ఉండు..తల్లిదండ్రులను జాగ్రత్తగా చూస్కో.. నీకు వైద్యఖర్చులకు అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను.. నీకు వైద్యం అందిస్తాను” అని హామీచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు,నెటిజన్లు తాతకు తగ్గ మనవడు అని కామెంట్లు చేస్తున్నారు.