వరద బాధితులకు అండగా జూ.ఎన్టీఆర్

Junior NTR
గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారు. అందులో భాగంగా వరద బాధితులకు అండగా నిలవడానికి భారీ విరాళం ప్రకటించారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో యాబై లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
వరదల నుండి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. వరద బాధితులకు ఆ దేవుడు అన్ని రకాలుగా అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి విపత్తుల నుండి ముందస్తు ప్రణాళికలతో మనల్ని కాపాడుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.
