జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డు..!

8 total views , 1 views today
ఐపీఎల్ -2025 భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అర్చర్ మొత్తం 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక స్పెల్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా మారారు.
మరోవైపు ఇదే మ్యాచ్ లో తీక్షణ(52), సందీప్ శర్మ(51)లు సైతం మరి ధారాళంగా పరుగులు ఇచ్చారు. అలాగే ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక బౌండరీలు(46) నమోదైన మ్యాచ్ గా కూడా ఈ మ్యాచ్ రికార్డ్ సృష్టించింది.
