ధోనీకి కోర్టు నోటీసులు…?

Jharkhand High Court Issues Notice To MS Dhoni
టీమిండియా లెజండ్రీ ఆటగాడు… మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎంఎస్ ధోనీ తన వ్యాపార మాజీ భాగస్వాములైన మిహిర్ దివాకర్, సౌమ్యదాసు తనను రూ.15 కోట్ల మేర మోసం చేశారని జనవరి ఐదో తారీఖు కోర్టును ఆశ్రయించారు.
అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు జారీ చేసింది.
