బుమ్రా ది గ్రేట్
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇండియా మొత్తం వికెట్లను కోల్పోయి 376పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకు ఆలౌట్ చేసింది..
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ మూడు వికెట్లకు ఎనబై ఒక్క పరుగులను చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లను సాధించాడు. దీంతో బంగ్లా తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది.
సొంత గడ్డపై బుమ్రా ఇప్పటివరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 15.94 సగటుతో & 32.4 స్ట్రైక్ రేట్ తో 37 వికెట్లను తీశాడు. ప్రపంచ క్రికెట్ లో బుమ్రా అత్యుత్తమ ఆటగాడని మరోసారి నిరూపించారని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.