పవన్ కళ్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు.
తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ స్పందిస్తూ హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు ఉప ముఖ్యమంత్రి పవన్కు లేదు.. ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు కూడా లేదు లేదు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. ఆలయాల పట్ల మాకున్న చిత్తశుద్ధి కూటమి సర్కార్కు లేదు.. కాశీనాయన ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కార్ ఎంతో కృషి చేసింది అని వైఎస్ జగన్ పేర్కోన్నారు.
