విజయసాయి రెడ్డి రాజీనామాపై జగన్ స్పందన..!
![విజయసాయి రెడ్డి రాజీనామాపై జగన్ స్పందన..!](https://www.singidi.com/wp-content/uploads/2024/09/YS-JAGAN-MOHAN-REDDY-850x560.jpg)
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి రాజీనామాపై పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తొలిసారి స్పందించారు.
రాజీనామాపై జగన్ స్పందిస్తూ ‘మాకు 11 మంది రాజ్యసభఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు.
రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్ను బట్టే ఉంటుంది. వైసీపీ కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది’ అని జగన్ స్పష్టం చేశారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)