పవన్ కళ్యాణ్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై పవన్ కళ్యాన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లకు జర్మనీలో అయితే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక్కడ రాదు అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటని వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని జర్నలిస్టులు ప్రశ్నించగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ ‘పవన్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు’ అని ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి.ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు.
175 మందిలో ఒకరికి ఇచ్చినట్టు టైమ్ ఇస్తామంటే ఎలా.సభలో ఇంతమంది సభ్యులు ఉంటేనే..ప్రతిపక్ష హోదా ఉంటుందని ఎక్కడా రూల్ లేదు .చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చాను.ఎంతసేపైనా మాట్లాడమని చంద్రబాబుకు మైక్ ఇచ్చాను.ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రిగ్గింగ్ చేశారు.ఉత్తరాంధ్ర టీచర్ ఓటర్లు బుద్ధి చెప్పారు అని వ్యాఖ్యానించారు.
