జగన్ కే ఓ ఎమ్మెల్యే నీతులు …?
వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా పొలిటికల్ ఎంట్రీచ్చాడు.. ఆ తర్వాత తన తండ్రి చావుకు కారణమైన.. తనతో పాటు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధించిన అప్పటి కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అనే పార్టీ పెట్టి మొదటిసారి ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది… ఆ తర్వాత ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన రికార్డులకెక్కిన పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్న జగన్ కే నీతులు చెబుతున్నారు ఓ ఎమ్మెల్యే..
వైఎస్సార్ కడప జిల్లాలోనే అత్యంత అవకాశ వాద రాజకీయ నాయకుడిగా పేరు గాంచిన ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా అప్పటి ఉమ్మడి ఏపీలో రెండు సార్లు (2004,2009) దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ్యానియాతో గెలుపొందారు.. ఆ తర్వాత వైఎస్ తనయుడైన వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీ లో చేరి రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు నుండి గెలుపొంది అధికార టీడీపీలో చేరారు. అయిన అప్పుడు ఆది నారాయణ రెడ్డికి ఆ పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదు.. అందుకే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ కనీసం టికెట్టు కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ నూటయాబై ఒక్కస్థానాలతో అధికారంలోకి రావడంతొ ఆది నారాయణ రెడ్డి తన ఫ్యూచర్ కోసం బీజేపీలో చేరారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి సాయంతో జమ్మలమడుగు నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆది నారాయణ రెడ్డి తాజాగా వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సవాళ్లు విసురుతున్నారు. జగన్ మీకు దమ్ముంటే జమ్మలమడుగులో నాపై నిలబడి గెలువు అని సవాళ్లు విసురుతున్నారు. రెండు సార్లు జగన్ తండ్రి దయతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మరోసారి జగన్ మ్యానియాతో గెలుపొంది అధికారం కోసం.. పదవుల కోసం వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరాడు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు కూటమి ప్రభావంతో గెలుపొంది.. సింగల్ గా సింగంలా ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్న అధికారాన్ని చేపట్టిన జగన్ కు సవాల్ విసిరేంత గొప్ప నాయకుడువై పోయావా.. నువ్వా నీతులు చెప్పేది అని వైసీపీ శ్రేణులు కౌంటర్ అటాకింగ్ లు చేస్తున్నారు