కోటి రూపాయలివ్వని జగన్..!

ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గతంలో విజయవాడలో వచ్చిన వరదలకు గురై సర్వం కోల్పోయిన బాధితులకు సాయంపై శాసనమండలిలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా వరద బాధితులకు వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన రూ.కోటి ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సమాధానంగా మంత్రి పార్థసారథి స్పందించారు.
ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన విరాళం అందలేదన్నారు. అలాగే, సాక్షి పేపర్ కొనుగోలుకు ప్రభుత్వం వాలంటీర్లకు నెలకు రూ.200 ఇచ్చింది.. అక్రమంగా చేసిన చెల్లింపులపై విచారణ చేయిస్తామని మంత్రి పార్ధసారథి తెలిపారు. అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు