వైసీపీ కార్యకర్తకు అండగా జగన్

YS Jagan Mohan Reddy Former CM Of Ap
వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాడేపల్లి గూడెంలో తన నివాసంలో కల్సిన ఇంటూరి రవికిరణ్ సతీమణీ సుజనకి భరోసానిచ్చారు.
జగన్ ను కల్సిన సుజన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె వాపోయారు.
ఇంకా కేసులున్నాయని పోలీసులు తమను బెదిరిస్తున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జగన్ అధైర్యపడకండి. అన్నివిధాలుగా పార్టీ అండగా ఉంటుంది. కార్యకర్తలను కాపాడుకుంటామని ఆయన హామీచ్చారు.
