తిరుమలకు జగన్ – లోకేష్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు శుక్రవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల రాకగురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలను ఎవరైన ఎప్పుడైన దర్శించుకోవచ్చు. కానీ హిందువులమని డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఎవరైన ఇవ్వాల్సిందే .ఇప్పటి రూల్ కాదు. ఎప్పటి నుండో వస్తుంది. అందరూ అన్ని మతాలను గౌరవించాలని మేము కోరుకుంటున్నాము..
మేము అన్ని మతాలను గౌరవిస్తూ విధి విధానాలను పాటిస్తాము. స్వామి వారి దర్శనానికి వచ్చే జగన్ సైతం నియమ నిబంధనలను పాటించాలి.. స్వామి వారంటే నమ్మకం ఉందని జగన్ వ్రాతపూర్వకంగా సంతకం చేయాలని లోకేశ్ సూచించారు.