కొడాలి నానికి జగన్ ఫోన్..!

గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఫోన్ చేశారు.
ఈసందర్భంగా జగన్ నాని ఆరోగ్య విషయాల గురించి ఆరా తీశారు.. ఆధైర్యపడవద్దు.. ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నానికి గుండె సంబధిత సమస్యలున్నాయని ఏఐజీ వైద్యులు నిర్ధారించారు. హార్ట్ లో మూడు వాల్వ్స్ బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించారు.