కంటెంట్ ఉన్న కౌశిక్ రెడ్డి ఇది పద్ధతేనా…?
పాడి కౌశిక్ రెడ్డి అంటే ఆరున్నడుగుల బుల్లెట్.. కంటెంట్ తో పాటు మంచి వాక్ చాతుర్యం… సబ్జెక్టు ఉన్న యువనాయకుడు.. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. మీడియా సమావేశం పెట్టిన.. ప్రభుత్వలోపాలను ఎత్తిచూపిన కౌశిక్ రెడ్డి మాటకు కానీ విమర్షకు కానీ తిరుగుండదు. అలాంటి కౌశిక్ రెడ్డి నిన్న బుధవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సబ్జెక్టూకు పార్టీ మారిన ఎమ్మెల్యేల నుండి కౌంటర్ ఇవ్వడానికి వాళ్లకు స్టఫ్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
కానీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ” పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నేను గిఫ్ట్ పంపుతున్నాను.. దమ్ముంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి.. చేయకపోతే నేను పంపే ఈ చీరలు.. గాజులు వేసుకోవాలి అని ఏకంగా మీడియా సమావేశంలోనే చూపించడం అప్పటిదాక మాట్లాడిన సబ్జెక్టు అంతా గాలికి పోయింది.. పాడికౌశిక్ రెడ్డి చూపించిన .. మాట్లాడిన ఈ మాటలను మీడియాతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు హైలెట్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో ఆ చీర గాజుల పార్ట్ తప్పితే మిగతా మాటలన్నీ వ్యాఖ్యలన్నీ ఎవరైన రాజకీయ కోణంలో చూస్తారు. కానీ ఈ చీర గాజుల విషయానికి వస్తేనే కొద్దిగా ఆలోచనలో పడతారు ఎవరైన..?
పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ రాష్ట్ర మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత , అధికార ప్రతినిధులు భవాని రెడ్డి , సంధ్యారెడ్డి లు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌంటరిచ్చారు. మహిళలంటే అంత లోకువ.. మహిళలు అంటే చేతకానివాళ్లా..?. మహిళల గురించి మరోక్కసారి తక్కువ చేసి మాట్లాడితే తమ కాళ్లకున్న చెప్పులను తీసి మరి చూపిస్తూ కొడతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన సబ్జెక్టు అంతా గాలికి పోయింది.. గాజులు,చీరలు ,చెప్పులే నిన్న మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే సబ్జెక్టు కంటెంటు ఉన్న యువనాయకుడైన పాడి కౌశిక్ రెడ్డి కొద్దిగా ఆలోచించి మాట్లాడితే పార్టీ బలం అవుతుంది.. తన పొలిటీకల్ కేరీర్ కు ఉపయోగపడుతుంది..