ప్రతివారం అది తప్పనిసరిగా చేస్తా-లావణ్య త్రిపాఠి..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి మనకు తెల్సిందే. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో తమ కుటుంబం ప్రతి వారం అభాగ్యుల కోసం అన్నదానం చేస్తోందని తెలిపారు.
మాకుటుంబం ప్రతివారం ఒకే చోటకి చేరి వంటవండుకుంటాము. ప్యాకింగ్ చేసి ఎంతోమంది అభాగ్యులకు ఆ అన్నాన్ని దానం చేస్తాము. అందులో ఎంతో సంతోషం ,ప్రేమ ,దేవుడికి కృతజ్ఞత నిండి ఉంటుంది. ఇదేదో ఇవ్వాలని ఇవ్వడం కాదు అని ఆ పోస్టులో వివరించారు.