దసరా పూజకు సరైన సమయం ఇదే…?
ఈరోజు దేశ వాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందు కాలాన్ని విజయ ముహూర్తంగా పండితులు చెబుతున్నారు.
ఆ సమయంలో శమీవృక్షా (జమ్మి చెట్టు)ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని అగ్నిగర్భ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని ఆర్ధం.
దీనికే శివా అనే మరో పేరు ఉంది. అంటే సర్వశుభకరమైనది. మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను ఆ జమ్మిచెట్టుపైనే దాచారు.