ఏఫ్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉందా..?

Is there a cabinet expansion on April 3rd?
ఉగాది పండుగ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసిన సందర్భంగా ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే చర్చ కొనసాగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం, వారికి శాఖల కేటాయింపులు కూడా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో మరో నలుగురికి మాత్రమే చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో ఇద్దరికి కొద్దికాలం తర్వాతనే అవకాశం లభించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గవర్నర్ భేటీ సుమారు గంటన్నర పాటు కొనసాగింది. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ రోజున మంచి ముహూర్తం ఉందని చెబుతున్నారు. ఇక మంత్రివర్గంలోకి ఎవరికి తీసుకోవాలన్నది హైకమాండ్ వద్దనే లిస్ట్ ఫైనలైజ్ అయింది అని అంటున్నారు. తగిన సమయంలో వారికి ఫోన్లు వస్తాయని మంత్రులుగా వారు ప్రమాణం చేయడమే తరువాయి అని అంటున్నారు.