సినిమా వాళ్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదా..?
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు ఊడిగం చేయడానికే మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పక్క రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు టిక్కెట్ల ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వము అని తేల్చి చెప్పింది. మీరేమో టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు.. బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని అనుమతులు ఇస్తారు. ఇదేనా ప్రజాస్వామ్యమా..?. పేదల కడుపు కొట్టీ సినిమావాళ్ల కడుపుల నింపుతరా..?అని కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
ఒకవైపు పండించిన పంటకు సరైన మద్ధతు ధరలు లేవు. పెట్టుబడికి సాయం అందించరు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలకు అండగా ఉండాల్సింది పోయి కేవలం వ్యాపారమే లక్ష్యంగా పని చేసే సినిమా వాళ్లకు అండగా ఉంటారా..?. ఇది ఎక్కడ పాలసీ అని ఆర్కే తీవ్రంగా విరుచుకుపడ్డారు.