అల్లు అర్జున్ చేసిన బిగ్ మిస్టేక్ అదేనా…?
పుష్ప – 2 విడుదల తర్వాత దేశవ్యాప్తంగా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకెళ్తుంది.అయితే తెలంగాణ లో మాత్రం పుష్పరాజ్ ను అదే సినిమా కష్టాల పాలు చేసింది..ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెల్లిన సందర్బంగా జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది.
వారి కుమారుడు గాయపడ్డాడు.అయితే రెండు రోజులకు అల్లు అర్జున్ 25 లక్షల సాయం ప్రకటించారు.సమస్య సమసిపోయిందనుకునే సమయానికి ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్,జైలుకు వెల్లి బెయిల్ పై రావటం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్,సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ వాఖ్యలు చేయటం,అసెంబ్లీలో సైతం దీనిపై చర్చ చేయడం జరిగింది.వాంటెడ్ గా ఇదంతా జరుగుతున్నట్టు జనాల్లో చర్చ ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదని సినివర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి..ఒక సినీ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి పేరు మరిచిపోవటం,అక్కడి వారంతా నవ్వటం రేవంత్ రెడ్డికి కోపం తెప్పించినట్టు సమాచారం.అసెంబ్లీలో చర్చ తరువాత అల్లు అర్జున్ ప్రెశ్ మీట్ పెట్టడం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించినట్టు చర్చ జరుగుతుంది.అందుకే ప్రభుత్వం అతన్ని బాగా టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం