రాహుల్ గాంధీ నిజంగానే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి దాదాపు పదిహేను నెలలు కావోస్తుంది. ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీ కెళ్లారు. వెళ్లిన ప్రతిసారి అప్పటి సందర్భాన్ని బట్టి ప్రధాన మంత్రి నరేందర్ మోదీనో.. కేంద్ర మంత్రులనో కల్సి వస్తున్నరు. తప్పా తన సొంత పార్టీ సీనియర్ నేత.. భవిష్యత్తు ప్రధాని అని కలలు కంటున్న రాహుల్ గాంధీని.. కానీ ఏఐసీసీ సీనియర్ నేత శ్రీమతి సోనియా గాంధీని కానీ అఖరికి ప్రియాంకా గాంధీని కానీ రేవంత్ రెడ్డి కల్సినట్లు ఒక్క వార్త కూడా తన అనుకూల మీడియాలో తప్పా ఏ మీడియాలో రాలేదు.
కనీసం ఫోటో కూడా దిగినట్లు ఇంతవరకూ ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం కానీ అటు మీడియాలో కానీ రాలేదు. అయితే ముఖ్యమంత్రి అలవి కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. కనీసం అమలయ్యే హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా పరోక్షంగా బీజేపీకి సహాకరిస్తున్నారు అనే వార్తలు రావడంతోనే కాంగ్రెస్ జాతీయ ముఖ్య నాయకులైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సైతం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు.
ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభకు సైతం అహ్వానించడానికి ఢిల్లీకెళ్ళిన రేవంత్ రెడ్డికి హ్యాండిచ్చారు రాహుల్ . కానీ అదే సభకు ఆహ్వానించడానికెళ్ళిన టీపీసీసీ చీఫ్ .. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కు సైతం అపాయింట్మెంట్ ఇచ్చారు. అఖరికి పార్టీలోనూ.. బయట తన సోదరీగా ఉన్న సహచర మంత్రి అయిన ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క)ను సైతం రాహుల్ గాంధీ కలిశారు . తప్పా ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీకెళ్లిన రేవంత్ ను కనీసం మూడు సార్లు కూడా కలవలేదని ఢిల్లీ ఇటు గల్లీ వర్గాల్లో టాక్. అక్కడదాకేందుకు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ సైతం తాజాగా వెళ్లి కల్సిన ఫోటోలు వైరల్ అయ్యాయి తప్పా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.

అయితే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే అటు ఏపీలోని టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో తెలంగాణలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి రావడానికి మార్గం సుగమం చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాలను గెలిచిన కాంగ్రెస్ ఎంపీ స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో గెలవడం.. అఖరికి తాను గెలుపొందిన మల్కాజిగిరి ఎంపీ.. తను ఇంచార్జ్ గా.. సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో బీజేపీ గెలవడం .. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడం లాంటి విషయాలను గమనించిన అధినాయకత్వం రేవంత్ రెడ్డి బీజేపీకి టచ్ లో ఉన్నారనే నెపంతోనే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
