కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో మంత్రా..? లేదా కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పాలేరా..?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ లో మంత్రివా..?. లేదా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పాలేరువా..? అని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి చామల.
మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలి. అప్పుడే అన్ని సజావుగానే కన్పిస్తాయని అన్నారు.
పదేండ్ల లో కేసీఆర్ చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే చేసి చూపించింది. మాజీ మంత్రి కేటీఆర్ పదేండ్లలో తేలేని పెట్టుబడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సార్లు దావోస్ కెళ్లి తీసుకోచ్చారు అని అన్నారు.