కాజల్ అగర్వాల్ ఇక “ఆ పాత్రలకే ” పరిమితమా..?

 కాజల్ అగర్వాల్ ఇక “ఆ పాత్రలకే ” పరిమితమా..?

Kajal Aggarwal Indian actress

కాజల్ అగర్వాల్ దాదాపు పదేండ్లు ఓ ఊపు ఊపిన హాటెస్ట్ బ్యూటీ.. తన అందచందాలతో సినీ ప్రేక్షకులతో పాటు యువతరం గుండెల్లో రైళ్లను పరుగెత్తించిన చందమామ. యువహీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా ప్రతీ సినిమాలో నటించింది ఈముద్దు గుమ్మ. అనుష్క తమన్నా లాంటి అందగత్తెలను సైతం పక్కకు పెట్టి స్టార్ హీరోయిన్ డమ్ ను తెచ్చుకుంది ఈ బ్యూటీ.

అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడి తలరాత మారిందనే చెప్పాలి.. పెళ్ళి తర్వాత రీఎంట్రీచ్చిన కాజల్ కు సరైన హిట్ చిత్రాలే కాదు ప్రధాన పాత్రలు సైతం దొరకలేదు అనే చెప్పాలి.. తన కేరీర్ లోనే ఫస్ట్ టైం పోలీస్ పాత్ర పోషించిన సత్యభామ మూవీ అట్టర్ ప్లాప్ అయింది. ఆ మూవీ అమ్మడుకి పేరు తీసుకురాలేదు.. కాసులను తెచ్చిపెట్టలేదు. ఇక నందమూరి నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి మూవీలో కాజల్ ది మెయిన్ పాత్రనే కాదని సినీ క్రిటిక్స్ విశ్లేషణ.. ఆ మూవీలో అమ్మడి పాత్ర కూడా ఆ విశ్లేషణకు తగ్గట్లే ఉంది.

పోనీ ఇప్పుడు ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో కాజల్ అగర్వాల్ కు అవకాశం దక్కిందని సినీ ఇండస్ట్రీ టాక్. అయితే ఈ మూవీలో కూడా అమ్మడుకి మెయిన్ పాత్ర కాదంట. మెయిన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా అని ఆ సినిమా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో అదే దర్శకుడి మూవీలో మెయిన్ హీరోయిన్ అయిన కాజల్ తాజా మూవీలో సెకండ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అన్నట్లు . అంటే కాజల్ అగర్వాల్ ఇక సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమ్మన్నమాట.. ఉన్నమాట.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *