పవన్ కి ఆడబిడ్డల రక్షణ కంటే జగనే ముఖ్యమా…?
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవారం పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి చెందిన సరస్వతి పవర్ భూములను పరిశీలించడానికెళ్లారు. ఈ పర్యటనపై వైసీపీ మాజీ మంత్రి.. కీలక నేత అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై.. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్న కానీ ఎప్పుడు స్పందించలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై కన్నేశారు. రెవిన్యూ అధికారులు.. అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసిన జగన్ కు చెందిన ఒక్క గుంట కూడా అటవీ భూమి కాదు..
అక్రమం కాదు అని తేల్చి చెప్పిన తర్వాత పని గట్టుకుని పనులన్నీ మానేసి జగన్ ఆస్తులను పరిశీలించడానికి సమయం ఉంటుంది కానీ ఆడబిడ్డలను పరామర్శించడానికి కనీసం సమయం లేదు.. పవన్ పర్యటనను ఉద్ధేశిస్తూ సరస్వతి భూముల పరిశీలనకు కాదు వెళ్లవలిసింది బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు వెళ్లాలి అని ట్వీట్ చేశారు.