అధికారంలో ఉంది కాంగ్రెస్సా..? బీఆర్ఎస్సా..?

ఆదివారం వనపర్తిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి ఎనిమిదిరోజులవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్ లో ఉన్నారు.. మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు దుబాయి వెళ్లి అబుదాబిలో జరిగిన దావత్ లో పాల్గోన్నారని ఆరోపించిన సంగతి తెల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది హారీశ్ రావు గారు.
ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్సెల్బీసీలో ప్రమాదం జరిగిన తర్వాత అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇచ్చి సందర్శనకు వచ్చింది.అధికారంలో ఉన్న మంత్రి, ఎస్సెల్బీసీ తన బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్ టూర్ వెళ్లి తీరిగ్గా వచ్చి ప్రమాదం జరిగిన చోట ప్రశాంతంగా చేపల కూర వండించుకుని తిన్నాడు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్ మంత్రులు వినోద ప్రాంగణంగా మార్చుకున్నారు.బాధిత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా హరీష్ రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ బృందం ఎస్సెల్బీసీ సందర్శనకు వెళితే కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా అడ్డుకుని ఆంక్షలు విధించింది.బీజేపీ బృందం సందర్శనకు వెళితే సాష్టాంగ నమస్కారం చేసి స్వాగతించింది
సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఎస్సెల్బీసీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్ హరీష్ రావు గారి మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు.ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా బాధితులకు భరోసా లేదు.ఆడలేక మద్దెలోడు అని హరీష్ రావు గారి మీద విమర్శలు చేయడం రేవంత్ అవివేకానికి నిదర్శనం అని విమర్శించింది.
