మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం..!
ఈ నెల 9 వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు గారితో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఆహ్వానం అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 7, 8, 9 తేదీలు మూడు రోజుల పాటు సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు మార్గం, బుద్ధపూర్ణిమ ప్రాంతమంతా తెలంగాణ సంబురాలు జరుగుతాయని వివరించారు. ఈ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పండుగ తెలంగాణ ప్రజలందరిదని అన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ గారిని, కిషన్ రెడ్డి ని, సంజయ్ ని కలిసి ప్రత్యేక ఆహ్వాన లేఖలను అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ని, ప్రొటోకాల్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.