ఢిల్లీలో చెల్లని రేవంత్ రెడ్డి మోడల్..?
తెలంగాణలో 6 గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ప్రతి వేదికపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,రేవంత్ రెడ్డి ఈ హామీలపై ప్రకటనలు చేశారు.అదికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని మాట ఇచ్చారు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రీ బస్ ,200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును మాత్రమే ప్రారంభించారు.. రుణమాఫీ చేసిన అది అరకొరగానే మిగిలిపోయింది.రైతు బంధు కార్యక్రమాన్ని రైతు భరోసాగా పేరు మార్చి అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రైతు భరోసాను రైతుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో జమ చేయలేదు.. పరిపాలన చేపట్టి ఏడాది పూర్తయిన హామీల అమలులో మాత్రం జాప్యం జరుగుతుంది.
అందుకు కారణము లేకపోలేదు, రాష్ట్ర బడ్జెట్ తో పోలిస్తే హామీలు అమలు అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.. ఎన్నికల కోసం ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అవి అమలు చేయడంలో మాత్రం విఫలమవుతుందని చెప్పాలి.. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లారు. అక్కడ తెలంగాణలో మేము ఆరు గ్యారంటీలు అమలు చేశామని ప్రచారం చేశారు. దీనితో అక్కడి ప్రజలు తెలంగాణ ప్రజలతో సంబంధాలు ఉండడంతో ఇక్కడ హామీల అమలు తీరు తెలిసి వారు ఓటు వేయలేదు..
కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం కూడా కోల్పోయింది..తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని అధిష్టానం పెద్దగా ప్రచారానికి పిలవట్లేదని తెలుస్తుంది.. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలులో లోపం జరుగుతున్న కారణంగా రేవంత్ రెడ్డి ని ఇక్కడికి తీసుకువచ్చే సాహసం కాంగ్రెస్ అధిష్టానం చేయట్లేదు.. రేవంత్ రెడ్డి మోడల్ ని మహారాష్ట్రలో చూపించి దెబ్బతిన్నామని,మళ్ళీ అదే మోడల్ ని ఢిల్లీలో ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరని భావించి రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రచారానికి పిలువట్లేదన్నట్టు తెలుస్తుంది..
తెలంగాణలో హామీల అమలు విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే దీనస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి,రేవంత్ రెడ్డి మోడల్ ని పరిచయం చేయడం వల్ల మళ్ళీ కష్టాల్లో పడే అవకాశం ఉన్నందున ఈ గ్యారెంటీ ల విషయాన్ని అక్కడ ప్రస్తావించే అవకాశం లేనట్టు తెలుస్తుంది..దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి మోడల్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని అందుకే డిల్లీలో రేవంత్ రెడ్డిని పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ విమర్శిస్తుంది.