టీ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అంతర్మధనం

 టీ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అంతర్మధనం

Telangana Senior Congress leaders

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో అప్పుడే అంతర్మధనం మొదలైందా..?. అధికారంలోకి రాలేమనుకున్నవాళ్ళు తీరా అంచనాలన్నీ తలకిందులై అధికారంలోకి వచ్చాక ఏమి చేయాలో ఆర్ధం కావడం లేదా..?. కనీసం నలబై యాబై సీట్లు వస్తాయేమో అని గంపగుత్త హామీలిచ్చి తీరా ఇప్పుడు వాటీని అమలు చేయాలంటే తలలు పట్టుకుంటున్నారా..?. గత మూడు నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటీవల పార్టీలో చేరి మంత్రులైన కొంతమంది నేతల తీరుతో ఆ పార్టీకి నష్టం చేకూరుతుందా..?. ఏదో ఆశించి అధికార పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. నేతల్లో అప్పుడే ఫ్యూచర్ పై భయం పట్టుకుందా..?. అందుకే పార్టీ మారినవాళ్ళు గమ్మున ఉంటున్నారా .? . అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు.

గత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా హైడ్రా, మూసీ సుందరీకరణ కార్యక్రమాలతో గ్రేటర్ హైదరాబాద్ లోని అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబీకుతుంది. ఒకపక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదలకు అన్ని రకాల వసతులు సదుపాయాలు కల్పించకుండా ఇండ్లను కూల్చి వేయడం. హైడ్రా పేరుతో సామాన్యుల దగ్గర నుండి సెలబ్రేటీల వరకు అందరివి కూల్చివేయడం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత చాపకింద నీరులా ఉంది. ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటును గ్రేటర్ ప్రజలు కాంగ్రెస్ కు కట్టబెట్టలేదు. మరోవైపు మరికొన్ని నెలల్లో గ్రేటర్ ఎన్నికల సమరం ఉంది.. అది దృష్టిలో పెట్టుకోకుండా హైడ్రా, మూసీ సుందరీకరణ అంటూ ఉన్నవాళ్లకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టడం కాంగ్రెస్ పై వ్యతిరేకత వస్తుంది అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకోవైపు గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రైతుభరోసా, రైతు రుణమాఫీపై సంబంధిత మంత్రులు చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తుంది. హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కే క్రమంలోనే సంబంధిత మంత్రులు తమ నోటికి పని చేబుతున్నారు అని ఇటు ప్రజలు అటు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. హామీల అమలు చేయకుండా ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రులు.. ఎమ్మెల్యే.. నేతల వరకు అందరూ తమదైన శైలీలో డైవర్శన్ పాలిటిక్స్ చేస్తూ పది నెలలు గడిపేశారు.. గ్రూప్ -1 అభ్యర్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్నారని వారిపై ఉక్కుపాదం మోపడం లాంటి చర్యలతో కాంగ్రెస్ పై ఐదేండ్లలో రావాల్సిన వ్యతిరేకత పది నెలల్లోనే రావడం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు జీర్ణించుకోలేని అంశంగా తయారైంది.

మరోవైపు రాజ్యసభ (మాజీ)సభ్యులు కృష్ణయ్య, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కొత్తగా బీసీ రాగం ఎంచుకోవడం కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలెక్క మారింది. ఇప్పటికే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడంతో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి మరోపక్క బీసీ రాగం ఎత్తుకున్న ఇలాంటి నేతల వల్ల తమ పరిస్థితి ఇంకా దిగజారుతుందేమో అని వారు అంతర్మధనం చెందుతున్నారని గాంధీభవన వర్గాలు అంటున్నాయి. ఇప్పటికైన ముఖ్యమంత్రి సోయిలోకి వచ్చి పరిపాలన.. అడ్మినిస్ట్రేషన్ పై దృష్టి పెట్టి ప్రజావ్యతిరేకతను తగ్గించుకునే చర్యలు చేపట్టాలి.. మున్ముందు స్థానిక గ్రేటర్ ఎన్నికల సమరం ఉన్న నేపథ్యంలో ప్రజల మనసును గెలుచుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీపీసీసీ వద్ద వాపోతున్నారంట. మరి చూడాలి మున్ముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇంకా.?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *