రిషబ్ పంత్ కు గాయం..!

rishabh panth
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఫీల్డింగ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గాయమైంది.కీపింగ్ చేస్తుండగా బాల్ అతడి వేలుకి బలంగా తగిలింది.
దీంతో ఫిజియోథెరఫి వచ్చి రిషభ్ పంత్ వ్రేలికి ట్రీట్మెంట్ చేశారు.అయినా నొప్పి తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడారు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కింగ్ కీపింగ్ బాధ్యతలను చేపట్టాడు.
అయితే గాయం పెద్దదైతే పంత్ బ్యాటింగ్ చేయడం కూడా కష్టమే అవుతుంది. మొదటి రెండు మ్యాచుల్లో సత్తా చాటిన పంత్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగకపోతే టీమిండియాకు గట్టి దెబ్బనే.