భారత్ ఘోర పరాజయం..!
మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఆసీస్ జట్టుపై ఘోర పరాజయం పాలైంది.
భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్ (84) మినహా మిగతా బ్యాట్స్ మెన్స్ అందరూ విఫలమయ్యారు. రిషబ్ పంత్ (30)పరుగులతో కుదురుకున్నట్లు అన్పించిన అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు.
ఈ విజయంతో ఆసీస్ 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే.