భారత్ ఘన విజయం
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా మొత్తం పది వికెట్లను కోల్పోయి 376 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి 287 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది..
తొలి ఇన్నింగ్స్ లో 149పరుగులకు బంగ్లా ఆలౌట్ అయిన సంగతి విధితమే.. 514 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా భారత్ బౌలర్లు 234 పరుగులకు కట్టడీ చేశారు.
కెప్టెన్ శాంటో ఎనబై పరుగులతో ఒంటరి పోరాటం చేసిన కానీ సహచరుల నుండి ప్రోత్సాహాం లేకపోవడంతో బంగ్లా ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఆశ్విన్ ఆరు వికెట్లు.. జడేజా మూడు వికెట్లు… బూమ్రా ఒక వికెట్ సాధించారు.