ఇండియా ఘోర ఓటమి
దాదాపు 27ఏండ్ల తర్వాత టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది.. శ్రీలంక తో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది..మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
లంక విధించిన 249 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగి 138 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35, సుందర్ 30,విరాట్ కోహ్లి 20, పరాగ్ 15 పరుగులు మినహా మిగతావాళ్లంతా సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమయ్యారు.
మరోవైపు లంక బౌలర్లలో వెల్లలాగే 5 వికెట్లతో చెలరేగారు. ఈ ఓటమితో భారత్ 0-2 తేడాతో 27ఏండ్ల తర్వాత సిరీస్ ను కోల్పోయింది.