టీం ఇండియా హిస్టరీ రిపీట్ చేస్తుందా…?
న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆ జట్టు ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెల్సిందే.. ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి .
అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులోనూ 107 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఉంచింది.. కానీ భారత స్పిన్నర్లు 93 పరుగులకే ఆలౌట్ చేశారు.
దీంతో ఇవాళ కూడా భారత బౌలర్లు విజృంభించి హిస్టరీ రిపీట్ చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్ వీడియోను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.