టీమిండీయా ఆలౌట్
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేసింది.
ఆల్ రౌండర్స్ రవిచంద్ర అశ్విన్ (113), రవీంద్ర జడేజ (86) పరుగులతో రాణించడంతో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది.
బంగ్లాదేశ్ జట్టు బౌలర్లలో హసన్ మహ్మూద్ ఐదు వికెట్లు, టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లను తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ విఫలమైన సంగతి తెల్సిందే.