సంక్రాంతి బరిలో మూవీలకు రేట్లు పెంపు..!
ఈనెలలో జరగనున్న తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి కి బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతి కి వస్తున్నాము అనే 3 సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ₹600, మల్టీఫ్లెక్స్కు ₹175, సింగిల్ స్క్రీన్ కు ₹135 పెంచుకోవడానికి అనుమతిచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు బాలయ్య బాబు డాకు మహారాజ్ బెనిఫిట్ షోకు ₹500, మల్టీఫ్లెక్స్ ₹135, సింగిల్ స్క్రీన్ కు ₹110 పెంపు ఉండొచ్చని తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సింగిల్ స్క్రీన్లో ₹75, మల్టీఫ్లెక్స్లో ₹100 పెంపు ఉంటుందని కూడా సమాచారం.