స్టార్ హీరోల చిత్రాల్లో అందాల ఆరబోతకేనా హీరోయిన్లు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం విడుదలవుతున్న స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతుంది.. కథ కథానంలో వారి వెయిటేజీ మరింత తగ్గుతుంది. కేవలం అందాల ఆరబోతకే అన్నట్లు ఉంటున్నాయి. కేవలం పాటల్లో హీరోతో ఆడిపాడటానికో. ఆ చిత్రంలో హీరో పక్కన గ్లామరస్ గా కన్పించడానికో అన్నట్లు ఉంటున్నాయి వారి పాత్రలు.. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన దేవర నుండి వెనక్కి వెళ్తే కల్కీ, గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా పలు సినిమాలు తారసపడతాయి..
ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన కల్కీ మూవీలో దీపికా పదుకునే లాంటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కేవలం పార్ట్ -2 నడిపించడానికే పెట్టినట్లు ఉంది. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరిని హీరో మహేష్ బాబు మందు తాగుతున్నప్పుడు స్టఫ్ అందించడానికే పెట్టినట్లు ఉంది. ఇక ఇదే సినిమాలో ఉన్న శ్రీలీల గురించి అయితే వేరుగా చెప్పనక్కర్లేదు.. కేవలం అందాలను ఆరబోయడానికి.. పాటల్లో చిందులేయడానికే అన్నట్లు తీసుకున్నరనుకుంట.
ఇటీవల విడుదలైన దేవర మూవీలో అయితే ఏకంగా తన తొలి మూవీలోనే అందాలను ఆరబోయడానికి.. పాటల్లో నర్తించడానికే తీసుకున్నట్లు జాన్వీ కపూర్ పాత్ర ఇందులో ఉంటుంది. మరి స్టార్ హీరోల సరసన హీరోయిన్లు కేవలం పాటలకే పరిమితమయ్యేటట్లు దర్శకులు కథలను సిద్ధం చేసుకుంటూన్నారు అనుకుంట.
వారు పాటల్లో ఉంటూ అందాలను ఆరబోస్తే చాలు అని అనుకుంటున్నారేమో మరి. ఇలాగే కొనసాగితే హీరోయిన్లను కేవలం ఆరు పాటలకోసమే తీసుకున్నట్లు అనుకునే పరిస్థితులు వస్తాయని సినీ క్రిటిక్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైన సరే సినిమాల్లో హీరోయిన్లకు కూడా స్పేస్ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.