MLA , MP కావాలంటే కోట్లు కుమ్మరించాలి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ డబ్బులతోనే నడుస్తున్నాయి.. డబ్బులు లేకుంటే రాజకీయాలు చేయలేము.. ఎమ్మెల్యే.. ఎంపీలు కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే అని అధికార కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ ” సంగారెడ్డి ఎమ్మెల్యే సీటు జనరల్ స్థానం.. అక్కడ గెలవాలంటే మినిమమ్ యాబై కోట్లు ఖర్చు పెట్టాలి. పఠాన్ చెరు కు వస్తే యాబై కోట్లు పెట్టాలి.. మెదక్ ఎంపీ సీటు కూడా జనరల్ అక్కడ నుండి గెలవాలంటే కూడా మినిమమ్ యాబై కోట్లు ఖర్చు పెట్టాలి.. ప్రస్తుతం రాష్ట్రంలో పైసలతో రాజకీయం నడుస్తుంది. పైసలు లేకపోతే రాజకీయాలు చేయలేము..
ఎప్పుడైన ఎక్కడైన సరే ఎన్నికల్లో కులం పోటి కాకూడదు.. డబ్బులు ముఖ్యం కాకూడదు.. కానీ ఇక్కడ రెండు ప్రధానంగా నడుస్తున్నాయి. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే పార్టీకివిధేయుడైన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవీ ఇచ్చారు. కాంగ్రెస్ లోనే కులాలకు మతాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.నేను ఎప్పటికైన సరే పీసీసీ చీఫ్ అవుతా.. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి కూడా అవుతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.