చలికాలంలో చల్లని నీళ్లు తాగితే..?
చలికాలంలో చల్లని నీళ్లు తాగితే అంతే సంగతులు అంటున్నారు వైద్యనిపుణులు. చల్లని నీళ్లు తాగడం వల్ల జలుబు వెంటనే వస్తుంది. ఛాతిలో కప్పం ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి కూడా వస్తుంది. చల్లని నీళ్లు గొంతును ఎక్కువ ప్రభావితం చేస్తుంది.
దీంతో గొంతి నొప్పి పుడుతుంది. చలికాలంలో చల్లని నీళ్లు హృదయంపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు ఎక్కువవుతుంది. చల్లని నీళ్ల వలన జీర్ణవ్యవస్థ ప్రభావితం చెందటంతో మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చల్లని నీళ్ళు దంతాల్లోని నరాలను దెబ్బతీయడం వల్ల అవి పాడై అవకాశాలు ఎక్కువ. పొట్టకు హాని కలిగి కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. చలికాలంలో చల్లని నీళ్లు కంటే గోరు వెచ్చని నీళ్లు తాగడం ఉత్తమం.