జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం..!

4 new airports in AP
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు.
‘‘20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాట విని ఆ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులూ ఉన్నతంగా ఎదుగుతారు. అధికంగా డబ్బు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారు. అలాంటి వారు తిరిగి సమాజానికి ఇవ్వాలి.
పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలి. జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుంది. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే పీ-4 విధానం తీసుకొస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు.