పార్లమెంటులో వరంగల్ ప్రజల గొంతుకనై విన్పిస్తా….

 పార్లమెంటులో వరంగల్ ప్రజల గొంతుకనై విన్పిస్తా….

పార్లమెంటు లో వరంగల్ ప్రజల గొంతుకనై నిలుస్తానని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయాన్ని, రాంనగర్ లోని సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య గారు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ, సిపిఎం నాయకులు వారికి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర, జిల్లా నాయకులను కలిసి ఎన్నికలలో సహకరించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు ఎన్నికలలో తనను భారీ మెజారిటీతో సీపీఐ, సిపిఎం శ్రేణులు గెలిపించారని అన్నారు. తనను సొంత పార్టీ అభ్యర్థిగా బావించి సీపీఐ, సిపిఎం కార్యకర్తలు భారీ మెజారిటీతో గెలిపించినందుకు వారందరికీ దన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పార్లమెంటులో ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జిల్లాలో పేదలు, గుడిసె వాసులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలకు పట్టాలు అందించేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ సారథి, నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,రాష్ట్ర నాయకులు టి. వెంకట్రాములు, పంజాల రమేష్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, పి. సుగుణమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాసుదేవ రెడ్డి, ఎం చుక్కయ్య, జీ. ప్రభాకర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రావుల రమేష్, వంకుడోత్ వీరన్న, గొడుగు వెంకట్, ఐద్వా జిల్లా కార్యదర్శి దీప, జేఏసీ అరుణ,
జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *