నాకు ఎలాంటి నోటీసులు అందలేదు- ఎమ్మెల్యే దానం నాగేందర్

MLA Danam Nagender
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి,రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అధికార కాంగ్రెస్ లో చేరారు.
వీరిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు సదరు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం తనకు ఇంతవరకూ నోటీసులు అందలేదు. స్పీకర్ నోటీసులు అందిన తర్వాత నా లీగల్ టీమ్ తో చర్చించి బదులిస్తాను అని ఆయన అన్నారు.
ఖైరతాబాద్ నియోజకబర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ” నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి అనుగుణంగా స్పీకర్ కు సమాధానం ఇస్తున్నారు, నోటీసులు వచ్చాక అందులో సారాంశం మేరకు లీగల్ ఒపీనియన్ తీసుకొని స్పీకర్ కు సమాధానం ఇస్తాను అని” ఆయన అన్నారు.