హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువ..!
ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలవరకు కొనసాగిన హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ స్వీకరించారు…
హైడ్రా ప్రజావాణి లో స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి మూడు వారాల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హామీచ్చారు..
అందిన పిర్యాదులలో ఎక్కువగా నగర వ్యాప్తంగా ఉన్న పలు చెరువులు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని పిర్యాదు చేశారని రంగనాథ్ తెలిపారు.