TDP Ex Mp మురళి మోహాన్ కు హైడ్రా నోటీసులు

Murali Mohan Indian Actor
ప్రముఖ తెలుగు సినిమా నటుడు.. టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహాన్ కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. మురళి మోహాన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ లోని రంగలాల్ కుంట FTl,బఫర్ జోన్ పరిధిలో మురళి మోహాన్ నిర్మించిన నిర్మాణాలు అక్రమంగా కట్టారు..
పదిహేను రోజుల్లో కూల్చి వేయాలి.. లేకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసింది. ఈనోటీసులపై నటుడు మురళి మోహాన్ స్పందిస్తూ ” నేను ముప్పై మూడేండ్లుగా రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. ఎప్పుడు కూడా నియమనిబంధనలను అతిక్రమించలేదు.
ఎక్కడ కూడా అక్రమంగా నిర్మాణాలు చేయలేదు. బఫర్ జోన్ లో మూడు అడుగుల మేర రేకుల షెడ్ ఉందని హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ షెడ్ ను తామే కూల్చేస్తామని ఆయన చెప్పారు. అయితే స్థానికుల పిర్యాదు మేరకు హైడ్రా అధికారులు వచ్చారని తెలుస్తుంది.