హైడ్రా ముసుగులో దందా – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా. రాజధాని నగర పరిధిలోని అక్రమణలకు గురైన ప్రభుత్వభూములను.. చెరువులను పరిరక్షించడమే హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ” హైడ్రా పని తీరుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వ్యవస్థతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. హైడ్రా పేరుతో అక్రమణదారులకు కబ్జాదారులకు నోటీసులు ఇస్తారు. కానీ ఎలాంటి చర్యలుండవు. అమాయక ప్రజలపైనే హైడ్రా జూలు విధిలిస్తారు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
నేను మ్యాన్ హట్టన్ భూముల గురించి పిర్యాదు చేయడానికి హైడ్రా కార్యాలయానికి వెళ్లాను. పిర్యాదు చేశాను. పిర్యాదు చేసి రశీదు అడిగితే ఇవ్వలేదు. రశీదు ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారో.. లేదో ఎలా తెలుస్తుంది. ఇదే అంశం గురించి హైడ్రా కమీషనర్ కు ఫోన్ చేస్తే కాల్ లిప్ట్ చేయలేదు. ఓ ఎమ్మెల్యే అందులో అధికార పార్టీ నేత పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
