మా ప్రభుత్వంలో భారీ అవినీతి- కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

Villagers revolt against Congress MLA..!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు అవినీతి జరుగుతుంది. ఇప్పటివరకూ తెచ్చిన లక్ష యాబై వేల కోట్ల రూపాయల అప్పులను సైతం అధికార పార్టీ నేతలు పంచుకోవడానికి.. ఢిల్లీకి పంపడానికి వినియోగించుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.
తాజాగా ఈ ఆరోపణలకు బలం చేకూరేవిధంగా అదే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జయశంకర్ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ “చేప పిల్లల పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది.
మంత్రి సీతక్క, నేను 1లక్ష 30 వేల చేప పిల్లలను వదిలితే అవి 80 వేలే వచ్చాయి.. కానీ కాంట్రాక్టర్ 8 లక్షల చేప పిల్లలు వదిలినట్లు కాంట్రాక్టర్ తప్పుడు లెక్కలు చూపించాడు.రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎక్కువ చేప పిల్లలను వదిలినట్లు అధికారులతో కలిసి కాంట్రాక్టర్లు తప్పుడు లెక్కలు చూపిస్తూ దోపిడీ చేస్తున్నారు అని ఆయన అన్నారు.