రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం

Huge amount of ganja seized in railway station
రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని తెనాలిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
3వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న పూరి – తిరుపతి ఎక్స్ప్రెస్ ఏ -1 కోచ్ 4 బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని రైల్వే సీఐ శ్రీనివాసరావు, జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గుర్తించారు.
తహశీల్దార్ కెవి గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చి ఆయన సమక్షంలో గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులు పరారయ్యారు.
