MLA గా పవన్ జీతం ఎంతో తెలుసా..?

4 total views , 1 views today
ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని చెప్పిన విషయం తెలిసిందే.
భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేనాని పవన్ కళ్యాణ్ జీతం ఎంతన్న చర్చ ప్రస్తుతం మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది.
ఇందులో నియోజకవర్గ అలవెన్స్ లతో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే జీతంగా అందుకుంటారు. ఇక దేశంలోనే తెలంగాణ ఎమ్మెల్యేలు అత్యధిక (రూ.4 లక్షలు) జీతం అందుకుంటున్నారన్న సంగతి తెల్సిందే.
