రాఖీని ఎప్పటివరకు ఉంచుకోవాలి..?

Rakhi Festival
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రక్షాబంధన్ సోదర సోదరిమణులకు ఎంతో ప్రీయమైన పండుగ. అయితే రాఖీ పండుగను ఎప్పటివరకు ఉంచుకోవాలనేది ప్రస్తుతం అందరిలోనూ చర్చ జరుగుతుంది. రాఖీ సందర్భంగా సోదరి కట్టిన రాఖీని దసరా పండుగ వరకు ధరించడం మంచిదని వేదపండితులు చెబుతున్నారు.
కనీసం జన్మాష్టమి (ఆగస్టు 16) వరకైనా రాఖీని ధరించాలని వారు సూచిస్తున్నారు. ఆ తర్వాత దానిని నీళ్లు పారుతున్న నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. సోదరి ప్రేమకు గుర్తు కాబట్టి దానిని తీసేటప్పుడు కూడా ఎలా పడితే అలా తెంచి వేయకూడదు. కట్ చేయకూడదు. రాఖీని జాగ్రత్తగా ముడి విప్పి తీయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల సోదర బంధం బలపడుతుంది. శుభఫలితాలు కూడా కలుగుతాయని వేదపండితులు అంటున్నారు.