సునీతా విలియమ్స్ ఎలా ల్యాండ్ అయ్యారంటే..!

సునీతా విలియమ్స్ ఈ రోజు తెల్లారుజామున ఉదయం గం. 3.45ని.ల ప్రాంతంలో భూమి మీద అడుగుపెట్టారు.సునీత, బుచ్విల్ మోర్వ్ లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో ‘క్రూ డ్రాగన్ వ్యోమనౌక’ తెల్లవారుజామున 3.27 గం.కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది.
గతేడాది జూన్లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. దీంతో తిరిగి రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగింది.
వెంటనే నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ వెస్సెల్ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సుల్ డోర్ను ఓపెన్ చేసి సునీతతో పాటు నలుగురు వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు.
