భూమి నుండి అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంది..?

భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి.
అయితే నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.
